కాంగ్రెస్ గిరిజన, దళిత, మహిళా వ్యతిరేకి అని దేశానికి తెలుసు

కాంగ్రెస్ గిరిజన, దళిత, మహిళా వ్యతిరేకి అని దేశానికి తెలుసు

మన దేశ తొలి గిరిజన రాష్ట్రపతిని కించపరిచినందుకుగాను పార్లమెంటులో, వీధుల్లో కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇది అత్యున్నత రాజ్యాంగ పదవి యొక్క గౌరవాన్ని కించపరిచేలా ఉందని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సభ్యులు రాజ్యాంగ పదవుల్లో ఉన్న మహిళలను కించపరుస్తూనే ఉన్నారని  స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేకి, దళిత & మహిళా వ్యతిరేకి అని దేశానికి తెలుసునని ఆరోపణలు చేశారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవికి నామినేట్ అయినప్పటి నుండి ఆమెను కాంగ్రెస్ దురుద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉందన్నారు. 

ఇటీవల కొత్తగా నియమితులైన భారత రాష్ట్రపతి ముర్ముపై ఎంపీ అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాష్ట్రపతి ముర్మును కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపత్ని అన్నందుకు గానూ దేశంలోని పలు చోట్ల ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బీజేపీ ఎంపీలతో కూడా ఆందోళనకు దిగారు. పార్లమెంటు ఎదుట అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ నేతలు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనలు సృష్టిస్తున్నాయి. అందుకు గానూ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్న బీజేపీ డిమాండ్ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంపీ అధీర్ రంజన్ క్షమాపణలు చెప్పారని తెలిపారు.