అనారోగ్యంతో కౌన్సిల‌‌ర్ మృతి

వ‌‌న‌‌ప‌‌ర్తి టౌన్, వెలుగు: వనపర్తి మున్సిపాలిటీలోని 31వ వార్డు కాంగ్రెస్  పార్టీ కౌన్సిలర్ బండారు రాధాకృష్ణ(46)  అనారోగ్యంతో సోమవారం చనిపోయాడు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితర నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసి నివాళులు అర్పించారు. కౌన్సిలర్  రాధాకృష్ణ మృతి కాంగ్రెస్  పార్టీకి తీరని లోటని, మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు కౌన్సిలర్  కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.