సమ్మర్ లో కాటన్ బట్టలు ఎంతో బెటర్

సమ్మర్ లో కాటన్ బట్టలు ఎంతో బెటర్

ఈ వేసవి కాలంలో సూర్యుడి వేడి తల, కళ్ళకు తగలకుండా చూసుకోవడం చాలా అవసరం. సూర్యుని కిరణాలు మధ్యాహ్న సమయంలో చాలా శక్తివంతంగా ఉంటాయి. అందుకే ఆ టైమ్ లో క్యాప్స్ లేదా కర్చీఫ్ లతో వేడి తగలకుండా కాపాడుకోవాలి. లేకుంటే వడ దెబ్బ తగిలి స్పృహ కోల్పోయే ప్రమాదముంది. ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. 

సమ్మర్ అనగానే అందరూ కాటన్ బట్టలు వేసుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో ప్రస్తుతం కాటన్ డ్రెస్సులకు  డిమాండ్ బాగా పెరిగింది. గత రెండేళ్ళుగా కరోనా వల్ల కాటన్ క్లాత్స్ స్టాక్ ఎక్కువగా లేకపోవడంతో ఈసారి రేట్లు భారీగా పెరిగాయి. మార్చిలోనే రేట్లు ఇలా ఉంటే ..వచ్చే రోజులతో పాటు పెళ్ళిళ్ళ సీజన్ లో మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. 

మార్కెట్లోకి వంద రూపాయల నుంచి 2 వేల వరకూ వివిధ రకాలైన క్యాప్స్, కూలింగ్ గాగుల్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు వ్యాపారులు. వెరైటీ డిజైన్లతో అందర్నీ ఆకట్టుకునేలా ఐటెమ్స్ తెస్తున్నామంటున్నారు. కరోనా వల్ల గత రెండేళ్ళుగా బిజినెస్ సరిగా జరగలేదనీ... ఈ  ఏడాది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోందని చెప్పారు.  

ఈసారి ఎండలు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయ్యాయనీ...అందుకే మధ్యాహ్నం టైంలో బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సిటీ జనం. ఒకవేళ వచ్చినా సమ్మర్ హీట్ తట్టుకోడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కాటన్ డ్రెస్సులు వాడుతున్నామనీ... అవి అయితేనే ఎండ నుంచి కాపాడుతాయంటున్నారు. ఈసారి కాటన్ డ్రెస్సుల రేట్లు పెరిగాయని చెప్పారు.  రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందనీ...బయటకు ఎంత తక్కువగా వెళితే అంత మంచిదనీ.... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

సట్టా బెట్టింగ్ రాకెట్ అరెస్ట్

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్