నాలుగు రాష్ట్రాల్లో మొదలైన కరోనా వ్యాక్సిన్ డ్రై రన్

నాలుగు రాష్ట్రాల్లో మొదలైన కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా టీకా డ్రైరన్ కొనసాగుతోంది. ఇవాళ, రేపు పంజాబ్, అసోం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు.  ప్రతి రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఈ డ్రై రన్ కొనసాగుతోంది.  వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు ఏ స్థాయిలో రెడీగా ఉన్నాయో తెలుసుకునేందుకు ముందుగా  కరోనా టీకా డ్రైరన్ నిర్వహిస్తోంది కేంద్రం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నాలుగు రాష్ట్రాలకు అందించింది. డ్రై రన్ లో సాఫ్ట్ వేర్ డేటా ఎంట్రీ నుంచి మాక్ డ్రిల్,  టీమ్ మేనేజ్ మెంట్,  ప్లానింగ్,  వ్యాక్సి నేషన్లో సమస్యలను పరిశీలించనుంది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ వేసే సిబ్బంది పనిని స్టడీ చేయనుంది. వ్యాక్సిన్లు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీలు,  ట్రాన్స్ పోర్ట్  నిర్వహణను అంచనా వేయనుంది. ప్రతి జిల్లాలో ఐదు రకాలుగా టీకా డ్రైవ్ చేపట్టనున్నారు అధికారులు.  జిల్లా హాస్పిటళ్లు,  కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు,  ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, అర్బన్ ప్రాంతాలు,  ప్రైవేట్ హెల్త్ సెంటర్లు,  గ్రామీణ ప్రాంతాల్లో  డ్రైరన్ ను ఎంచుకోనున్నారు. జిల్లా స్థాయిలో మాక్ డ్రిల్ ను అంచనా వేసి ఆ డేటాను రాష్ట్ర,  కేంద్రస్థాయిలో అందించనున్నారు అధికారులు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేటర్లకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రైనింగ్ ఇచ్చారు అధికారులు. వ్యాక్సినేటర్లు, అడ్మినిస్ట్రేటర్లు,  మెడికల్ ఆఫీసర్లు,  కోల్డ్ చైన్ మెయింటైన్ చేసేవాళ్లు,  ఆశా కో ఆర్డినేటర్లకు శిక్షణ పూర్తయింది.  టీకా వేసే ప్రక్రియ,  కొవిన్ పోర్టల్,  బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ,  మేనేజ్మెంట్పై ట్రైనింగ్ ఇచ్చారు. జాతీయస్థాయిలో ఇచ్చిన ట్రైనింగ్ లో  2 వేల 360 మంది పాల్గొన్నారు.  ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తయింది. మొదటి విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. టీకా వేయాల్సిన వారిని…. నేషనల్ ఎక్స్  పోర్ట్  గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ టీమ్.. మూడు భాగాలుగా విభజించింది. వీరిలో హెల్త్ వర్కర్లు కోటి మంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు 2 కోట్ల మంది,  ప్రియారిటీ ఏజ్ గ్రూప్ వారు 27 కోట్ల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 28వేల 947 కోల్డ్ చైన్ పాయింట్లు… 85 వేల 634 ఎక్విప్మెంట్లను స్టోరేజ్ కోసం రెడీ చేశారు.