అన్నవరం దేవస్థానం సిబ్బందికి కరోనా పరీక్షలు

అన్నవరం దేవస్థానం సిబ్బందికి కరోనా పరీక్షలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం సిబ్బందికి  ఇవాళ(మంగళవారం) కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అన్నవరంలో నిన్న( సోమవారం) ఇద్దరికీ కరోనా వైరస్ వచ్చింది. దీంతో ఆ ఇద్దరితో ప్రైమరీ కాంటాక్ట్ గా పది మంది దేవస్థాన సిబ్బందిని గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా వీరందరికీ కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులను స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం జరిగిందని తెలిపారు. పుణ్యక్షేత్రం అన్నవరం గ్రామం లో 2 కేసులు రావడంతో అధికార యంత్రాంగంతో పాటు దేవాదాయ శాఖ అలర్టైంది.