దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 17 కోట్లు దాటింది. నిన్న ఒక్కరోజు దేశ వ్యాప్తంగా 11,20,281 టెస్టులు చేయడంతో డిసెంబర్ 29 వరకు టెస్టులు 17కోట్ల 9 లక్షల 22 వేల 30 కి చేరాయి. గత మూడు నాలుగు రోజులుగా తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 20,550 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,44,853 కు చేరింది. నిన్న 286 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 1,48,438కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 2,62,272 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న26,572 మంది కోలుకోవడంతో మొత్తం కరోనా నుంచి 98,34,141 మంది రికవరీ అయ్యారు.
India reports 20,550 new COVID-19 cases, 26,572 recoveries, and 286 deaths in last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,02,44,853
Active cases: 2,62,272
Total recoveries: 9,83,4141
Death toll: 1,48,439 pic.twitter.com/9br6ssSed2
— ANI (@ANI) December 30, 2020
