యూకే నుంచి ఏపీకి వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్

యూకే నుంచి ఏపీకి వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్
యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు వచ్చిన వారి సంఖ్య 1363కి చేరింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారు.. వారి కాంటాక్ట్స్‌లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇప్పటివరకు 1,346 మందిని అధికారులు ట్రేస్ చేయగా, మరో 17 మంది కోసం ట్రేసింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. యూకే నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 11 మందికి కరోనా పాజిటివ్ గా కన్ఫాం అయ్యింది. అనంతపురం, నెల్లూరులో ఒక్కొక్కరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారి కాంటాక్ట్స్‌లో 5,784 మందికి పరీక్షలు నిర్వహించారు. యూకే రిటర్న్స్‌తో కాంటాక్ట్ అయిన 12 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనిమిది మందికి పాజిటివ్‌ కాగా, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురికి, నెల్లూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.