చిత్తూరు: కరోనా తో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్ని తమ గ్రామ సమీపంలో నిర్వహించవద్దంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. జిల్లాలోని రేణిగుంట మండలం తుకివాకం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తమ గ్రామంలో కూడా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో అంత్యక్రియలు జరుపడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణగుప్తా సంఘటన స్థలానికి చేరుకుని.. పోలీసుల బందోబస్తుతో అంత్యక్రియలు జరిపారు. దీంతో తూకివాకం గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
