నీ ఆత్మహత్య ప్రయత్నం వల్ల మాకు నష్టం..రైతుకు10 లక్షల బిల్లు పంపిన పోలీసులు

రైతు దేశానికి వెన్నెముక..జవాన్ తర్వాత అంతటి స్థానం రైతుకు ఉంటుంది..మన దేశంలో రైతుకు అంత విలువ, ప్రాధాన్యత ఉన్నది. అయితే రైతుకు ఇటీవల కాలంలో కష్టాలు పెరిగిపోయాయి. పండించిన పంటకు ధర లేక, తన భూములను లాక్కోవడం, భూతగాదాలు ఇలా అనేక కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సింది పోయి..వారిపైనే దాడులు జరుగుతున్నాయి.రాజస్థాన్ లో ఆదుకోవాల్సిన పోలీసులే.. రైతుకు పెనాల్టీ నోటీసులు పంపించారు.వివరాల్లోకి వెళితే.. 

అది రాజస్థాన్ లోని జుంజులోని గోత్రహాల్ దేవాగావ్ గ్రామం. ఈ గ్రామంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఈగ్రామానికి చెందిన విద్యాధర్ యాదవ్ అనే రైతును పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి తోడు వారి ఖర్చులకింద రూ. 10లక్షల పెనాల్టీ కట్టాలని నోటీసులు ఇచ్చారు. 

ఏం జరిగిందంటే.. 

రైతు విద్యాధర్ యాదవ్ గత కొంతకాలంగా గ్రామంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. తమ భూమిని అన్యాయంగా కంపెనీ యాజమాన్యం ఆక్రమించిందని, తన కుటుంబాన్ని వేధిస్తుందని  ఆత్మహత్య  చేసుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ గ్రామంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా రైతు నిరసన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని గేటు ముందుకు కూర్చున్నారు. దీంతో కంపెనీ యాజమాన్యం పోలీసులు రప్పించింది..పోలీసు ఉన్నతాధికారులతో సహా దాదాపు 99 మంది పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రైతును అడ్డుకున్నారు. 

ALSO READ | 750 రూపాయలు కట్టండి.. లక్షాధికారి కండి.. కోట్లకు మోసం చేసిన ఇంటర్ స్టూడెంట్

పోలీసు పెనాల్టీ నోటీసులు.. 

డిసెంబర్ 17న స్థానిక ఎస్పీ నుంచి విద్యాధర్ యాదవ్ కు పెనాల్టీ నోటీసులు వచ్చాయి..నీవు ఆత్మహత్యం చేశారు. నిన్ను కాపాడేందుకు మేం సంఘటనా స్థలానికి వచ్చాం..భద్రత చర్యలకోసం అయిన ఖర్చు 9లక్షల 99వేల 577 రూపాయలు అయ్యింది వెంటనే చెల్లించాలని నోటీసులు చెప్పారు. 
ఈ గ్రామంలో ఉన్న సెమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనగా ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు అతనికి పెనాల్టీ నోటీసులు పంపించారు. లక్షల్లో డిమాండ్ చేస్తూ నోటీసులు పంపించారు. రైతు విద్యాధర్ యాదవ్ కు ఉన్న బాధలు సరిపోవన్నట్టుగా పోలీసులు పెనాల్టీ నోటీసులు మరింత భారంగా మారాయి. 

రైతు మద్దతుగా గ్రామస్తులు..

రైతు విద్యాధర్ యాదవ్ కు పెనాల్టీ చెల్లించాలని చేసిన పోలీసుల డిమాండ్ విమర్శలకు దారితీసింది.విద్యాధర్ కు సంఘీభావంగా గ్రామం గ్రామమంతా ఏకమైంది. భద్రత కోసం వచ్చిన పోలీసుల ఖర్చును రైతు నుంచి వసూలు చేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. ప్రత్యేకించి అన్యాయం జరిగిందని రైతు నిరాశ చెంది ఆత్మహత్యాయత్నం చేస్తే.. కాపాడాం ఖర్చులివ్వండి అని పోలీసులు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ యాజామన్యం రైతు కుటుంబానికి చేసిన అన్యాయాన్ని ఖండించారు.

రైతు విద్యాధర్ కు సిమెంట్ కంపెనీ నష్ట పరిహారం చెల్లించాలని స్థానిక రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. కంపెనీ తన చర్యలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.