పెరిగిన వంట గ్యాస్ ధర

పెరిగిన వంట గ్యాస్ ధర

దేశంలో వంట గ్యాస్ ధర 25 రూపాయలు పెరిగింది. పెట్రోల్ డీజల్ ధరల పెరుగుదల ప్రభావంతో వంట గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. దేశంలో ఇప్పటికే కొన్ని నెలలుగా పలుసార్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. లేటెస్టుగా మరోసారి సబ్సిడీయేతర గ్యాస్‌ బండపై రూ.25 మేర పెరిగింది. ఈ ధరలు నిన్నటి(ఆగస్టు-17) నుంచే అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబైలో సిలిండర్ ధర రూ.859.50కు చేరుకుంది. కోల్‌కతాలో రూ.886గా ఉంది. గత నెల 1వ తేదీన కూడా LPG సిలిండర్ ధర రూ.25.50 పెరిగింది.

మరోవైపు దేశ వ్యాప్తంగా  పెట్రోల్,డీజిల్ ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి.