బాగా ఉడికించిన గుడ్లు, మాంసాన్నే తినండి

బాగా ఉడికించిన గుడ్లు, మాంసాన్నే తినండి
న్యూఢిల్లీ: దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరుగుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళతోపాటు హిమాచల్ ప్రదేశ్‌‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని గుర్తించారు. ఈ విషయంపై కేంద్ర యానిమల్ హజ్బెండరీ, ఫిషరీస్ అండ్ డైరీ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ స్పందించారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని గిరిరాజ్ సూచించారు. గుడ్డు, మాంసాన్ని బాగా ఉడికించి తినాలన్నారు. ‘బర్డ్ ఫ్లూతో పలు చోట్ల కొన్ని జంతువులు చనిపోయాయని రిపోర్టులు అందాయి. భయపడాల్సిందేమీ లేదు. గుడ్లు, మాంసాన్ని బాగా ఉడికించి తినండి. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశాం’ అని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. పౌల్ట్రీ ఫామ్స్‌‌ను బయో సెక్యూరిటీలో ఉంచాలని, బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలను డిసిన్‌‌ఫెక్ట్ చేయాలని, చనిపోయిన కోళ్లను పూడ్చాలని కేంద్రం సూచించింది.