న్యూజిలాండ్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే తండ్రి కాబోతున్నారు. అతని భార్య కిమ్ ఈ వారంలో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో కాన్వే.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుకు దూరంగా ఉండనున్నారు. కిమ్ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆమె పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న కివీస్ బ్యాటర్.. ఈ విషయాన్ని బోర్డుకు ముందే తెలియజేశారు. దాంతో, న్యూజిలాండ్ బోర్డు కాన్వే స్థానంలో మార్క్ చాప్‌మన్ చివరి టెస్టుకు ఎంపిక చేసింది.
ఈ విషయంపై న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. 'అటగాళ్ళకైనా, సిబ్బందికైనా కుటుంబ మొదటి ప్రాధాన్యత. కిమ్ బిడ్డకు జన్మనివ్వనుంది. ఇది వారి కుటుంబంలో సంతోషాన్ని నింపే విషయం. అతనికి జట్టు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది..' అని స్టెడ్ అన్నారు.
Devon Conway will miss New Zealand's third and final Test against England this week ahead of the birth of his first child #NZvENG pic.twitter.com/k917E3rD58
— ESPNcricinfo (@ESPNcricinfo) December 9, 2024
వైట్ వాష్ తప్పించుకుంటారా..!
స్వదేశంలో రోహిత్ సేనను 3-0 తేడాతో మట్టికరిపించిన కివీస్.. అనూహ్యంగా వారి సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో ఓడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ ఇప్పటికే 2-0తో చేజిక్కించుకుంది. డిసెంబర్ 14 నుంచి హామిల్టన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.