మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి

  • ఉన్నత విద్యా మండలి ఆఫీస్ ఎదుట కాంట్రాక్ట్  లెక్చరర్ల ధర్నా

మెహిదీపట్నం, వెలుగు: తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్  చేయాలని డిమాండ్  చేస్తూ కాంట్రాక్ట్  లెక్చరర్లు సోమవారం మాసాబ్  ట్యాంక్ లో ఉన్నత విద్యా మండలి ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని గతంలో సీఎం రేవంత్  హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. 

రెగ్యులరైజేషన్  ప్రక్రియ ఆలస్యమైతే బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ చెల్లించాలన్నారు. 12 వర్సిటీలకు చెందిన అసిస్టెంట్  ప్రొఫెసర్లు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత 30 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకొని ఉంటున్న తమని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. దీంతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలపడంతో వారు ధర్నాను విరమించారు.