హైవేపై కంటైనర్ బోల్తా .. 3 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్​ చౌరస్తా ఫ్లైఓవర్​ వద్ద 44 నంబర్​ హైవేపై హైదరాబాద్  వైపు నుంచి కర్నూల్​ వైపు వెళ్తున్న కంటైనర్  అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్  రాం బహదూర్, క్లీనర్​ మాన్ వేందర్ కు స్వల్ప గాయాలయ్యాయి. హర్యానా రాష్ట్రం గురుగావ్  నుంచి కర్నాటక రాష్ట్రం కోచ్ కోడ్ కు కొరియర్లో డ్​తో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 గాయపడిన వారిని హైవే అంబులెన్స్ లో కర్నూల్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్​ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడడంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్​ను క్లియర్​ చేసేందుకు చర్యలు చేపట్టారు.