కాలి బూడిదైన కొత్త కార్లు

  • సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో హైవేపై ఘటన

జహీరాబాద్, వెలుగు : నేషనల్ హైవే పై జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కొత్త కార్లు కాలి బూడిదైన ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్  బై పాస్ రోడ్డులో చోటు చేసుకుంది. ముంబై నుంచి హైదరాబాద్ వైపు టాటా నెక్సాన్ కార్ల లోడుతో వస్తున్న కంటైనర్  లో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులోని 8  కొత్త కార్లు కాలిపోయాయి. వాటి విలు రూ. 2 కోట్లు ఉంటుంది.

సమాచారం అందడంతో జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బంది వెళ్లి  మంటలు ఆర్పివేశారు. కంటైనర్ లో తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోనే అగ్నిప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.