- నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ
సిద్దిపేట రూరల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చిన్న గుండవెల్లి ఎస్సీ కాలనీలో బోరుబావి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదటగా రూ. 30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించామని, రెడ్డి కమ్యూనిటీ సంఘం కోసం రూ.పది లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించామని తెలిపారు.
కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ అత్తు ఇమామ్, సీనియర్ నాయకులు కలీముద్దీన్, యాదగిరి, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, బుస్సాపూర్ మాజీ సర్పంచ్ సదాశివ రెడ్డి, రాములు, అంజిరెడ్డి, మహిపాల్ రెడ్డి, పద్మారెడ్డి పాల్గొన్నారు.