స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం పెట్టాలి : పూజల హరికృష్ణ

సిద్దిపేట, వెలుగు: రెసిడెన్షియల్ స్కూల్​లో చదివే స్టూడెంట్స్​కు  నాణ్యమైన భోజనం పెట్టాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి పూజల హరికృష్ణ అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్​ను ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూళ్లలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం రూపొందించిన డైట్ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు.  

కొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి మచ్చ తచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఈ విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. స్కూల్​లో  డైట్ ప్రకారం వంటలను తయారు  చేయనందుకు వార్డెన్, కాంట్రాక్టర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి ,బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పాండు , కలీంఉద్దీన్, గయాజుద్దీన్, అక్బర్, చోటా అజ్మత్, చంది రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కవిత, వనజ, సాంబమూర్తి  పాల్గొన్నారు.