నా ఫ్యామిలీని హత్య చేసేందుకు కుట్ర: విష్ణుపై ఫిర్యాదు చేసిన మనోజ్

హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తన కుటుంబాన్ని హత్య చేసేందుకు సోదరుడు విష్ణు కుట్ర చేశాడని మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లోని జనరేటర్‎లో చక్కెర కలిపిన డిజిల్ పోసి.. విద్యుత్‎ సరఫరాలో భయంకరమైన హెచ్చుతగ్గులు వచ్చేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మనోజ్.

మా అమ్మ, నా తొమ్మిది నెలల పాప, బంధువులు ఇంట్లో తీవ్ర ఇబ్బంది పడ్డారని.. నేను, నా భార్య ఇంట్లో లేని సమయంలో ఇలా చేశారని తెలిపారు. నా సోదరుడు విష్ణుతో పాటు ఆయన అనుచరులు కలిసి ఈ కుట్ర పన్నారని ఆరోపించాడు. నా తల్లి బర్త్ డే అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విష్ణు, అతడి అనుచరులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని మనోజ్ పోలీసులను కోరాడు. తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని మనోజ్ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. 

కాగా, గత 10 రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతోన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు హైడ్రామా చోటు చేసుకుంది. తండ్రి మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గేట్లు తోసుకుని బలవంతంగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. 

ALSO READ | మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్

ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహానికి గురైన మోహన్ బాబు.. తన ఇంటి వద్ద జరుగుతోన్న పరిస్థితులను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగాడు. ఏకంగా జర్నలిస్టుల చేతిలో మైకును లాక్కునే వారిపైనే దాడి చేశాడు. ఫ్యామిలీ ఇష్యూ, మీడియాపై దాడి చేయడంతో రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై సీరియస్ అయ్యారు. 

మంచు ఫ్యామిలీ లొల్లి మరింత ముదరటంతో విచారణకు హాజరు కావాలంటూ మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు బుధవారం (డిసెంబర్ 11) మనోజ్, విష్ణు విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం, కోర్టు మినహాయింపుతో మోహన్ బాబు పోలీసుల దర్యాప్తుకు హాజరు కాలేదు. మరోవైపు.. జర్నలిస్ట్‎పై దాడి ఘటనపై మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.