కరోనా వైరస్ వెనుక చైనా భారీ కుట్ర..వెలుగులోకి వచ్చిన ఆధారాలు

కరోనా వైరస్ వెనుక చైనా భారీ కుట్ర..వెలుగులోకి వచ్చిన ఆధారాలు

బయోవార్ కోసం చైనాయే కరోనా వైరస్‌ని తయారుచేసి… ప్రపంచంపై వదిలిందనీ… దీనికి వాక్సిన్ ఆల్రెడీ ఉందనీ, దాన్ని ఎక్కువ రేటుకు అమ్ముకునేందుకు చైనా ఈ వైరస్‌ని సృష్టించిందని వినిపిస్తున్న వాదన, అమెరికా.. చైనాపై చేస్తున్న ఆరోపణలు నిజమనేలా కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయని ఓ ఇంగ్లీష్ వార్తా సంస్థ ప్రచురించింది.

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఉన్న విషయం మనకు తెలుసు. తాజాగా ఆ రెండు దేశాలూ… కరోనా యుద్ధం చేస్తున్నాయి. కరోనా వైరస్ రావడానికి కారణం మీరంటే మీరంటూ రెండు దేశాలూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఐతే… కరోనా వైరస్ ఎక్కడి నుంచీ వచ్చింది.. ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం లేదు. బయోవార్ కోసం చైనాయే ఈ వైరస్‌ని తయారుచేసి… ప్రపంచంపై వదిలిందనీ… దీనికి వాక్సిన్ ఆల్రెడీ ఉందనీ, దాన్ని ఎక్కువ రేటుకు అమ్ముకునేందుకు చైనా ఈ వైరస్‌ని సృష్టించిందనే వాదన ఒకటుంది. ఇప్పుడు చైనాలో ఈ వైరస్ కంట్రోల్ అవ్వడం కూడా… చైనా పాలకుల ప్లాన్‌లో భాగమే అంటున్నారు. ఐతే… చైనా మాత్రం కొత్త వాదన తెరపైకి తెచ్చింది. ఈ వైరస్ తొలి కేసు తమ దేశంలోనే నమోదైనా… అసలీ వైరస్‌ని చైనాకు తెచ్చింది అమెరికాయే అంటోంది. ఇదంతా అమెరికా కుట్రలో భాగమంటోంది. అమెరికా ఆర్మీనే కరోనా వైరస్‌ను చైనాకు తీసుకొచ్చిందని తాజాగా చైనా అధికారులు ఆరోపించారు. దీంతో ఏది నిజం, ఏది అబద్ధం అన్నదానిపై చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వుహాన్ మార్కెట్ నుంచి సోకింది కాదని, వుహాన్ లో ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి వైరస్ లీకైందంటూ అమెరికా ప్రభుత్వానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు వాషింగ్ టన్ డీసీకి ఆధారాలిచ్చారంటూ యూకే ప్రముఖ మీడియా సంస్థ ది సన్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.

ది సన్ తెలిపిన వివరాల ఆధారంగా…

వుహాన్ కు చెందిన వైరాలజీ సైంటిస్ట్ గబ్బిలాలను పట్టుకోవడాన్ని చూపించే ఓ షార్ట్ ఫిల్మ్.. కరోనా వైరస్ మనుషులు తయారు చేశారని, మరియు ల్యాబ్ నుండి బయటపడిందనే వాదనకు ఆజ్యం పోసినట్లైంది.

“యూత్ ఇన్ ది వైల్డ్ – ఇన్విజిబుల్ డిఫెండర్” అనే ఏడు నిమిషాల డాక్యుమెంటరీలో వూహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి) సైంటిస్ట్ టియాన్ జున్హువా ఉండడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ డాక్యుమెంటరీలో టియాన్ హుబే ప్రావిన్స్ లోని గుహల్లోని గబ్బిలాల లాలాజలాన్ని, వాటి నమూనాలను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తున్నాయి.

గబ్బిలాల్లో ఉన్న వైరస్ లను గుర్తించడంలో టియాన్ దిట్ట

గబ్బిలాల్లో ఉన్న వైరస్ లను గుర్తించడంలో టియాన్ దిట్ట. ఆయన పనిచేసే వూహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి)కు, కరోనా వైరస్ ప్రారంభమైనట్లు చెప్పుకునే వుహాన్ మార్కెట్ కు పెద్ద దూరంలేదని తెలుస్తోంది. టియాన్ గబ్బిలాల నుంచి లాలజాలాల్ని, మలాల్ని సేకరించి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ల్యాబ్ లో పరిశోధనలను చేస్తారని అమెరికా ప్రభుత్వాని చెందిన అధికారి వాషింగ్టన్ టైమ్స్‌ ఇచ్చిన నివేదికలో ఉన్నట్లు దిసన్ తెలిపింది. వుహాన్ మార్కెట్ కు వంద గజాల దూరంలో ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ల్యాబ్ లో పరిశోధనలు చేస్తూ అక్కడే నివసిస్తున్నట్లు చెప్పాడు. ఇటీవల కాలంలో చైనాలో కొత్తగా గుర్తించిన వైరస్, వాటి పరిశోధనల్లో టియాన్ కీరోల్ ప్లే చేసినట్లు తేలింది.

వుహాన్ ఈవెనింగ్ న్యూస్

డిసెంబర్ నెలలో కరోనా వైరస్ వ్యాపించడానికి కొద్దిసేపటికి ముందు సోషల్ మీడియాలో షేర్ అయిన ఏడు నిమిషాల డాక్యుమెంటరీలో వైరాలజీ సైంటిస్ట్ టియాన్ హుబీ ప్రావిన్స్ గుహల్లో ఉన్న గబ్బిలాల్ని పట్టుకొని వాటి నుంచి నమూనాలను సేకరించి, బంధించే సన్నివేశాలున్నాయి. 2017 మే నెలలో వుహాన్ ఈవెనింగ్ న్యూస్ తో సైంటిస్ట్ టియాన్ మాట్లాడుతూ గుహల్లో డజన్ల కొద్ది గబ్బిలాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాకరమైన వైరస్ లు ఉన్నాయి. అందుకే గబ్బిలాలపై పరిశోధనలు చేస్తే.. మానవజాతికి మంచిదని అన్నాడు.

వైరాలజీ ల్యాబ్ నుంచే మనుషులకు సోకి ఉండి ఉంటుంది: బయో సెక్యూరిటీ సైంటిస్ట్ రిచర్డ్ ఎబ్రైట్

బయో సెక్యూరిటీ సైంటిస్ట్ రిచర్డ్ ఎబ్రైట్ గతంలో చెప్పినట్లుగా, సైంటిస్ట్ టియాన్ ఒకసారి ఒక గుహలో గబ్బిలాల్ని పట్టుకునేందుకు ఎటువంటి సూట్ ధరించకుండా వెళ్లాడు. దీంతో గబ్బిలాల మూత్రం ఆయన చేతులకు అంటుకుంది. గబ్బిలాల నుంచి వచ్చే ఓ వైరస్ బారిన పడకుండా ఉండటానికి, అతను 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు నివేదించింది. కరోనా వైరస్ లక్షణాలున్న బాధితులకు 14రోజులు క్వారంటైన్ తరువాతే టెస్ట్ చేయడం అందుకు ఊతం ఇస్తోంది.

2013 లో వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కనుగొన్న, వుహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి) లో అధ్యయనం చేసిన గబ్బిలం వైరస్ మాదిరిగానే కరోనా వైరస్ 96.2 శాతం సమానంగా ఉందని వాక్స్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో బయాలజీ ప్రొఫెసర్ బయో సెక్యూరిటీ సైంటిస్ట్ రిచర్డ్ ఎబ్రైట్ చెప్పారు. చైనాలోని పలు ప్రాంతాలలో ఉన్న వుహాన్ మునిసిపల్ సిడిసి మరియు వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో ల్యాబ్ లు కరోనా వైరస్ లను సేకరించి పరిశోధనలు చేస్తాయని చెప్పిన ఆయన ..ల్యాబ్ నుంచి వైరస్ మనుషులకు సోకిందనే అనుమానం వ్యక్తం చేశారు.

టియాన్ పై స్పందించని చైనా

సైంటిస్ట్ టియాన్ తో మాట్లాడేందుకు వాషింగ్టన్ టైమ్స్ ప్రయత్నించగా విఫలమైంది. దీంతో పాటు వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయానికి మెయిల్ చేసినా సమాధానం ఇవ్వలేదని వాషింగ్ టన్ టైమ్స్ ప్రయత్నించగా..వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తెలిపింది. సన్ ఆన్‌లైన్ సైతం టియాన్ గురించి వచ్చిన కథనంపై లండన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది.