కాంగ్రెస్ సీనియర్ నేత వోరా కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత వోరా కన్నుమూత
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్  నేత మోతీలాల్ వోరా(93) కన్ను మూశారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వోరా ఈ నెల 19న రాత్రి ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. వోరా ఆదివారమే 93వ పుట్టిన రోజు జరుపుకున్నారు. వోరాకు  అక్టోబర్ లో కరోనా వచ్చింది. అక్టోబర్ 16 న కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఉత్తర ప్రదేశ్ మాజీ గవర్నర్ గా పనిచేశారు. 1985 మార్చి 13న వోరాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించారు. 1988 ఫిబ్రవరి 13 న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మోతిలాల్ వోరా మృతిపై  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఆయన నిజమైన కాంగ్రెస్ మనిషి అని.. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడని కొనియాడారు రాహుల్ గాంధీ. వారి కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ .. ఓ చుక్కాని లాంటి వ్యక్తిని కోల్పోయిందన్నారు.  వోరా మృతికి ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. పాలనలో, వ్యవస్థాగతంగా గొప్ప రాజకీయ అనుభవమున్న వ్యక్తి అని మోడీ కొనియాడారు. కేఎల్ రాహుల్‌‌ను ఓపెనర్‌‌గా దించాలి GHMC ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన కాంట్రాక్టర్లు