ముంబై: కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ అనంతరం వెలువడిన పలు సర్వేలు వెలువడ్డాయి. దీనిపై సంజయ్ రౌత్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ గెలుపు అంటే అది ఇండియా కూటమి విజయం. నేను దాన్ని బలంగా నమ్ముతా. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపొందితే విపక్షాల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుంది. దీనిని కూటమి విజయంగా చూడాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే నాయకత్వమే ఇందుకు కారణం’ అన్నారు.
