కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ మండిపడుతోంది..దేశానికి ఎంతో చేశాం..దేశాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెబుతున్న ప్రధాని మోదీ.. గత పదేళ్లలో ప్రభుత్వ ఆస్తులను అమ్మడం తప్పా చేసేందేమి లేదని తీవ్రంగా విమర్శిస్తోంది. మోదీ పదేళ్ల పాలనలో జరిగిన పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (PSU) ప్రైవేటీకరణ గురించి ధ్వజమెత్తింది.
గత 70 ఏళ్లలో 11 మంది ప్రధానులు 188 పీఎస్ యూలను సృష్టిస్తే.. ప్రధానమోదీ పదేళల్లో ఒక్క పీఎస్ యూని కూడా ఏర్పాటు చేయకపోగా.. 23 పీఎస్ యూలను ప్రైవేటీకరణ చేశారని మండిపడింది.
70యేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అత్యధికంగా పీఎస్ యూలు సృష్టించబడ్డాయి.. భారతదేశంలో పీఎస్ యూలను సృష్టించిన చరిత్ర కాంగ్రెస్ ది..ఏడు దశాబ్దాల్లో 188 పీఎస్ యూలను సృష్టించారు.. నాటి ప్రధానులు చేపట్టిన పీఎస్ యూలు దేశాభివృద్దికి బాటలు వేశాయని.. ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను పెంచాయని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది..ఈ విషయాన్ని NITI అయోగ్ లెక్కలే చెబుతున్నాయని నొక్కి చెప్పింది.
ALSO READ | మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి
తండ్రి ఇచ్చిన ఆస్తులను కొడుకు తెగనమ్మి.. తర్వాత తండ్రినే నిందిస్తాడు.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీరు అలాగే ఉంది.. గత 70యేళ్ల కాంగ్రెస్ ఏమీ చేయలేదుగానీ.. బీజేపీ చేసింది మాత్రం ఇది అని.. పీఎస్యూ ప్రైవేటీకరణ లెక్కలు చెబుతూ కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది.
NITI అయోగ్ లెక్కల ప్రకారం.. కాంగ్రెస్ హయాంలో మాత్రమే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్(PSU) సృష్టి జరిగింది. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో 33, ఇందిరాగాంధీ హయాంలో అత్యధికంగా 66, మన్మోహన్ సింగ్ హయాంలో 23 ఆ తర్వాత రాజీవ్ గాంధీ 16, పీవీ నరసింహారావు హయాంలో 14 PSU లను సృష్టించారు.
లాల్ బహదూర్ శాస్త్రి -5, ఐకే గుజ్రాల్ 1, దేవెగౌడ్ 3, మొరార్జీదేశాయ్ 9 PSU లతో పబ్లిక్ సెక్టార్ ను బలోపేతం చేశారు. గత ప్రధానులు ఎవరూ ప్రైవేటీకరణ జోలికి వెళ్లలేదు. బీజేపీ ప్రధాని వాజ్ పేయీ హయాంలో కూడా 17 PSU లతో పబ్లిక్ సెక్టార్ ను డెవలప్ చేశారు. అయితే వాజ్ పేయి ప్రైవేటీకరణను కూడా ప్రోత్సహించారు.. 7 కంపెనీలను ప్రైవేట్ పరం చేశారని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
మన విశ్వగురు ప్రధాని మోదీ మాత్రం కేవలం ఎనిమిదేళ్లలో PSU లను ఒక్కటికూడా సృష్టించలేకపోయారని విమర్శించారు. నిజంగానే ప్రధాని మోదీ దేశానికి చాలా చేశారు.. మేం 70 యేళ్లలో పూర్తి చేసిన వాటిని.. కేవలం 8సంవత్సరాల్లో అమ్మి పెట్టారని కాంగ్రెస్ నతేలు సెటైర్లు వేస్తున్నారు.
కరోనా సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలను ఆదుకుంది.. ఏ ఒక్క పౌరుడు కూడా ఆకలితో ఉండకుండా కాపాడుకుంది అని ప్రధాని మోదీ చెపుతున్నారు..నిజానికి మహమ్మారి సమయంలో ప్రజలు ఆకలితో అలమటించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
చేదు నిజం ఏంటంటే..గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్ లో భారత్ 101 స్థానంలో ఉంది.. ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్ ల కంటే చాలా వెనకబడి ఉన్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.