మహబూబ్​నగర్​ స్థానం కాంగ్రెస్​ పార్టీదే : రాజేందర్​ ప్రసాద్

కొత్తకోట, వెలుగు:     మహబూబ్​నగర్​లో కాంగ్రెస్​ జెండా ఎగురుతుందని కాంగ్రెస్​ పార్టీ వనపర్తి  డీసీసీ అధ్యక్షులు రాజేందర్​ ప్రసాద్​ అన్నారు.  పట్టణంలో కాంగ్రెస్​పార్టీ డీసీసీ అధ్యక్షులు  మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.     పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంబడే  ఆరు గ్యారెంటీల్లో   మిగిలిన   హమీలను సీఎం రేవంత్​ రెడ్డి  నేరవేరుస్తాడన్నారు.   కార్యక్రమంలో కాంగ్రెస్​ పార్టీ  పట్టణ అధ్యక్షులు మేస్ర్తీ శ్రీను, మాజీ జెడ్పీటీసీపిజె బాబు,  కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకులు వేముల శ్రీనువాస్​ రెడ్డి,  కృష్ణ రెడ్డి, బోయేజ్​, నరేందర్​రెడ్డి  పాల్గొన్నారు.