50 ఏండ్ల బీజేపీకి అభ్యర్థులు కరవైన్రు : వంశీ చంద్ రెడ్డి

  •     పాలమూరు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి 

పాలమూరు, వెలుగు: యాభై ఏళ్ల బీజేపీకి అభ్యర్థులే  కరవయ్యారని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు.  శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అడ్డాకుల వైసీపీ రాధా జయప్రకాశ్‌‌‌‌‌‌‌‌ దంపతులకు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ..   కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని తెలిపారు.