మన్మోహన్ సింగ్​కు భారత రత్న ఇవ్వాలి : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేంద్రా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కల సాకారం కావడానికి మన్మోహన్ సింగే కారణమని తెలిపారు. మన్మోహన్ ను గౌరవిస్తే పీవీని గౌరవించినట్టేనని చెప్పారు.

హైదరాబాద్ లో మెట్రో రైలు మొదటి దశ పూర్తి కావడానికి, ఐటీ అభివృద్ధి చెందడానికి ఇలా రాష్ట్రంలో ఆయన మార్కు ఉందని పేర్కొన్నారు. రైతులకు రూ. లక్ష రుణమాఫీ, ఆహార భద్రతా, ఉపాధి హామీ పథకం అమలు, సమాచార హక్కు చట్టం వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి దేశంలో పారదర్శకమైన పాలన అందించారని జీవన్ రెడ్డి వెల్లడించారు.