కేటీఆర్ పాస్​పోర్టు సీజ్ చేయండి : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, అందుకే ఏసీబీ అధికా రులు వెంటనే ఆయన పాస్​పోర్టును సీజ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంక ట్ కోరారు. మంగళవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ తప్పు చేయకపోతే ఆయనకు లీగల్ టీం ఎందుకని ప్రశ్నించారు. దొంగలకు అండగా ఉంటారా?  ప్రజలకు అండగా ఉంటారా? అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తేల్చుకోవాలన్నారు.

పార్ములా–ఈ రేసు కోసం వెచ్చించిన రూ.55 కోట్లు ప్రజల సొమ్ము అని, ఇది కేటీఆర్ కు ఆయన నాన్న కేసీఆర్ కట్టబెట్టిన డబ్బు కాదని తెలిపారు. బాధ్యత గల ఎమ్మెల్యేగా తప్పు చేయలేదని కేటీఆర్ నిరూపించుకోవాలని సూచించారు. దోచుకున్న ప్రజల సొమ్మును జనానికి చెందేలా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేటీఆర్ తప్పు చేయకపోతే ఏసీబీ విచారణకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే డ్రామారావు విచారణకు డుమ్మా కొట్టారని ఆరోపించారు.