కేటీఆర్ అమెరికాలో డ్రగ్స్ డిటాక్స్ చేయించుకున్నడు : ఎమ్మెల్సీ బల్మూరి

కేటీఆర్  అమెరికాలో డ్రగ్స్ డిటాక్స్ చేయించుకున్నడు : ఎమ్మెల్సీ బల్మూరి
  • అందుకే ఇప్పుడు సవాల్ విసురుతుండు

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ మూడు నెలలు అమెరికాలో ఉండి డ్రగ్స్ డిటాక్స్ చేయించుకొని వచ్చి ఇప్పుడు సవాల్ విసురుతుండని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో వైట్ చాలెంజ్ విసిరితే ఇప్పుడు దాన్ని స్వీకరించడంలో అర్థం లేదన్నారు. దుబాయ్ లో చనిపోయిన కేదార్ తో కేటీఆర్ కు ఎలాంటి సంబంధాలు లేకపోతే ఆయన మృతిపై విచారణ కోసం సీఎం రేవంత్ కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

 గతంలో కేటీఆర్ కుటుంబ ఫంక్షన్ ను ఆర్గనైజ్ చేసిందే కేదార్ అని వెంకట్ ఆరోపించారు. తాము ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేసీఆర్, కేటీఆర్ లు లైడిటెక్టర్ టెస్టులు చేయించుకోవాలని సవాల్ విసిరారు.