కాంగ్రెస్​ మేనిఫెస్టోతో యువతకు లాభం

వనపర్తి, వెలుగు: నిరుద్యోగులు, యువతకు ప్రొఫెషనల్  కాంగ్రెస్  మేనిఫెస్టో ఎంతో ఉపయోగపడుతుందని, కేంద్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం వస్తే విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఏఐపీసీ స్టేట్​ టీమ్​ ఇన్​చార్జి నావికా హార్సె తెలిపారు. సోమవారం ఓ ఫంక్షన్​హాల్​లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు, యువతను ఏ విధంగా మోసం చేసిందో డిజిటల్  స్క్రీన్  ద్వారా  వివరించారు. నాగర్​కర్నూల్​ ఎంపీగా మల్లురవిని గెలిపించాలన్నారు. జిల్లెల ఆదిత్య రెడ్డి, ఏఐపీసీ స్టేట్​ టీం మెంబర్స్​ రాహుల్ రెడ్డి, ఇర్ఫాన్,  కార్తీక్ రెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్ నాగిరెడ్డి వంశీ, బీసీ సెల్  జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి, గణేశ్ గౌడ్, ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు రోహిత్  పాల్గొన్నారు.