మహిళా సంఘాలకు పెరటి కోళ్ల పంపిణీ

మద్దూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నదని పీఏసీఎస్ చైర్మన్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నర్సింలు పేర్కొన్నారు. మంగళవారం మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని సింగిల్ విండో ఆఫీస్ ఆవరణలో మహిళా సంఘాల సభ్యులకు పెరటి కోళ్లను అందజేశారు.

 పెరటి కోళ్ల పెంపకానికి 155 మందికి గాను 3 వేల ఆరువారాల కోడి పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. వచ్చే నెలలో మద్దూరు మండలానికి 60 పాడి పశువులను పక్క రాష్ట్రాల నుంచి స్త్రీనిధి ద్వారా కొనుగోలు చేసేందుకు నిర్ణయించామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో నర్సింహ రెడ్డి, ఎంపీవో రామన్న, ఏపీఎం నారాయణ తదితరులు  పాల్గొన్నారు.