- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన నాయకులు
నందిపేట, వెలుగు: ఉమ్మడి నందిపేట మండలంలోని ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని శనివారం కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్‌రెడ్డి, ఎత్తిపోతల చైర్మన్లు హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆశించిన వర్షాలు లేక బోరు బావుల్లో నీరు అడుగంటిందని, ఉమ్మడి నందిపేట మండలంలో ఎత్తిపోతలే ఆధారమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని వారు మంత్రికి విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో డీసీసీ ఉపాధ్యక్షుడు పెంట ఇంద్రుడు, ఎత్తిపోతల చైర్మన్లు బోజారెడ్డి, ఓంకార్, తదితరులు ఉన్నారు.