బస్టాండ్ కు నిధులు కేటాయించండి

  •     మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి

అమ్రాబాద్, వెలుగు : శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారిలో మన్ననూరు అంబేద్కర్  చౌరస్తాలో నూతనంగా నిర్మించిన బస్టాండ్ లో సౌలతులు కల్పించేందుకు నిధులు కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కాంగ్రెస్  నాయకులు కోరారు. సోమవారం మంత్రి శ్రీశైలం దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మన్ననూరు టూరిజం గెస్ట్​ హౌస్​ వద్ద ఆగారు. కాంగ్రెస్  నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

అనంతరం గ్రామంలో కొత్తగా నిర్మించిన బస్టాండ్​లో సౌలతులు కల్పించాలని, యువతకు ఆర్టీసీలో ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. శ్రీనివాసులు, బాలమ్మ రవి, రహీం, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, జాకీర్, దేవేందర్, ఆంజనేయులు, శంకర్ పాల్గొన్నారు.