ఇఫ్తార్ విందులో పాల్గొన్నా కాంగ్రెస్​ నేతలు

మక్తల్, వెలుగు: పట్టణంలోని షరీఫా మజీద్ లో కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు రవికుమార్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్  విందులో పాలమూరు కాంగ్రెస్  పార్టీ ఎంపీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి  పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్​ విందు ఆరగించారు. బాలకృష్ణారెడ్డి, రామారావు, లక్ష్మారెడ్డి, పోలీస్  చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు గౌడ్, బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అయూబ్ ఖాన్, మహమ్మద్  నూరుద్దీన్  పాల్గొన్నారు.

వంగూరు: మండల కేంద్రంలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్  విందులో నాగర్​కర్నూల్​ ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బాధితుల కుటుంబసభ్యులను పరామర్శించారు. పాండురంగారెడ్డి, యాదగిరిరావు, రమేశ్ గౌడ్, జనార్దన్, నరేందర్ రెడ్డి, షరీఫ్ ఖాన్, గఫూర్, చంద్రయ్య, మల్లేశ్, శివశంకర్  పాల్గొన్నారు.