భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ నేతల సమావేశం

భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ నేతల సమావేశం

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్లీనరీలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్న నేతలు.. ఈ యాత్రకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారు. రాబోయే సంస్థాగత కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో జూలై 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల కోసం పార్టీ వ్యూహంపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు రాష్ట్రపతి ఎన్నికల వ్యూహంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సమావేశానికి జనరల్ సెక్రటరీలు, పీసీసీలకు, వివిధ రాష్ట్రాల ఇన్ ఛార్జిలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, జై రాం రమేష్, అజయ్ మాకెన్, దిగ్విజయ్ సింగ్ ఉమెన్ చాంది పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.