రుణమాఫీపై మాట్లాడే హక్కు లేదు : శెక్షావలి ఆచారి

అయిజ, వెలుగు: రుణమాఫీ మార్గదర్శకాలను బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తప్పు పట్టడం సరైంది కాదని కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శెక్షావలి ఆచారి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  ప్రభుత్వం రుణమాఫీపై అనేక రూల్స్​ పెట్టిందన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పీఎం కిసాన్  సమ్మాన్  నిధి పథకానికి 18 నిబంధనలు పెట్టిందని తెలిపారు. బీఆర్ఎస్  పదేండ్ల పాలనలో కేవలం రూ.28 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు. మొదటి విడతలో గురువారం రూ.లక్ష లోపు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. రైతు వేదికల్లో జరిగే వేడుకల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి సంఘీభావం తెలపాలని కోరారు. మద్దిలేటి, జయన్న, మధు కుమార్, మేకల నాగిరెడ్డి, ఆర్.శ్రీధర్, గాలి రెడ్డి, సురేశ్ గౌడ్, బస్వరాజు, సాంబశివుడు పాల్గొన్నారు.