కిషన్ రెడ్డి, బండి సంజయ్.. కార్యకర్తలను రెచ్చగొడుతున్నరు: జగ్గారెడ్డి

బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్  నేత జగ్గారెడ్డి. ప్రియాంక గాంధీపై మాజీ ఎంపీ రమేశ్ బిధూరి  చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుబట్టాల్సి పోయి సమర్థించుకుంటున్నారని పైర్ అయ్యారు. 

బీజేపీ ఆఫీస్ పై దాడిని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  ఖండించారు కానీ.. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలను దాడులకు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఒక మహిళగా ఎంపీ డీకే అరుణ రమేష్ బిధురి వ్యాఖ్యలను సమర్థిస్తారా అని ప్రశ్నించారు. గాంధీ భవన్ ను పేలుస్తానంటున్న రాజాసింగ్..ఫస్ట్ బీజేపీ పార్టీ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని సూచించారు జగ్గారెడ్డి.

ALSO READ | హైదరాబాద్‎లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు

మేం తల్చుకుంటే రోడ్లపై తిరగరు

బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ కార్యక ర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్  తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కిషన్ రెడ్డి