న్యూఢిల్లీ: కాంగ్రెస్ పడువుతున్న నావ లాంటిదని, ఆ పార్టీ పనైపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ‘కాంగ్రెస్ నేతలను మేం చేర్చుకోవడం లేదు. ఆ పార్టీలోని నేతలందరూ కాంగ్రెస్‌ను ఎప్పుడు వీడుదామాంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదు. దిశానిర్దేశం చూపే నాయకత్వం లేని దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ ఉంది’ అని నరసింహారావు చెప్పారు.
