10 నెలల్లో 60 వేల ఉద్యోగాలిచ్చాం: మంత్రి శ్రీధర్​ బాబు

నిరుద్యోగుల కోసం స్కిల్  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌బాబు

అలంపూర్, వెలుగు: కాంగ్రెస్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఐటీ మంత్రి శ్రీధర్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌బాబు చెప్పారు. ఆదివారం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం హరితహోటల్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఎస్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. 

తెలంగాణలో కాంగ్రెస్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ క్యాలెండర్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసి నిరుద్యోగులకు మేలు చేశామని చెప్పారు. డీఎస్సీ ఎగ్జామ్స్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ నిర్వహించి 100 రోజుల్లోపు రిజల్ట్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ విడుదల చేసి ఉద్యోగాలు సైతం ఇచ్చిన ఘనత కాంగ్రెస్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ పార్టీ, సీఎం రేవంత్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌రెడ్డిదేనన్నారు. ఎంపికైన వారికి ఈ నెల 9, 10 తేదీల్లో సీఎం చేతుల మీదుగా అపాయింట్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌మెంట్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ ఆర్డర్లు అందజేస్తామన్నారు. 

నిరుద్యోగుల కోసం రూ. 2,460 కోట్లతో స్కిల్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ డెవలప్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌మెంట్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో 10 వేల మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక స్కిల్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ డెవలప్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌మెంట్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ ఆఫీస్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ను ఓపెన్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ చేస్తామన్నారు. ఆలంపూర్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ జోగులాంబ ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

అలంపూర్ నియోజకవర్గంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలని జోగులాంబ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో సంపత్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌కుమార్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఆయన వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌కుమార్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌, నాయకులు దీపక్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ ప్రజ్ఞ, నీలి శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ నాగేశ్వర్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌రెడ్డి, మార్కెట్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ యార్డ్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ చైర్మన్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ దొడ్డన్న, ఇస్మాయిల్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌, సిరాజ్  ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.