హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం

  • సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్

ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తోంది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పార్టీ పదో జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. అణిచివేతకు గురవుతున్న ప్రజలు కమ్యూనిస్టుల వైపు చూస్తున్నారన్నారు. శ్రీలంకలో జరిగిన అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులకే అధికారం అప్పగించారని తెలిపారు. 

మనువాద దృక్పథంతో దేశాన్ని పాలించే దిశగా బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు.  ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను కాంగ్రెస్ కార్యకర్తలతో చేయించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇందిరమ్మ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు స్థానం కల్పించి, పారదర్శకతను పాటించాలని సూచించారు.  నేతలు జాన్‌ వెస్లీ, డీజీ నర్సింహారావు, భూపాల్, కాడిగళ్ల భాస్కర్, సామెల్ తదితరులు పాల్గొన్నారు.