అమిత్ షాను బర్తరఫ్ చెయ్యాలి.. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ ధర్నా

 పార్లమెంట్ లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. అమిత్ షా  అంబేద్కర్ ను  అవమానపరిచారని.. ఆయన వెంటనే  రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో  అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర  ఆందోళన చేశారు. ఈ  ఆందోళనలో మంత్రి పొన్నంతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్  వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్,పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

 అంబేద్కర్..అంబేద్కర్. . అంబేద్కర్ అని అనడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది.. అంబేద్కర్ పేరు కంటే.. దేవుడి పేరు స్మరించినా స్వర్గానికి వెళ్లేవారు అంటూ  రాజ్యసభలో అమిత్ చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్‎ను నిండు సభలో అమిత్ షా అవమానించారని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. 

2024, డిసెంబర్ 19వ తేదీన పార్లమెంట్ భవనం ముందు కాంగ్రెస్‎తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల ఎంపీల పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంబేద్కర్ చిత్రపటాలను చేతిలో పట్టుకుని జై భీం.. జై జై భీం నినాదాలతో హోరెత్తించారు ఎంపీలు.   ఈ క్రమంలోనే పార్లమెంట్ ముందు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎదురుపడ్డారు. అక్కడ జరిగిన స్వల్ప తోపులాటలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగీ, ముఖేష్ రాజ్ పుత్ కింద పడ్డారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.