ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

ఢిల్లీలో  కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి.  కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు   టైర్లు తగులబెట్టారు.

 కాంగ్రెస్ జిందాబాద్... రాహుల్ జిందాబాద్.. అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.  ముందుగానే అక్కడ మోహరించిన పోలీసులు.. నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో  ఏఐసీసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము ఉగ్రవాదులం కాదని...త మను చూసి ఎందుకు భయపడుతున్నారంటూ  కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పోలీసులపై మండిపడ్డారు. మరోవైపు ఈడీ ఆఫీస్ పరిసరప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.