నాంపల్లి సెంటర్లో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు : అసలు కారణం ఇదీ..!

హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. బీజేపీ ఆఫీసు ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణ చెలరేగింది. బీజేపీ దళిత నేతలు, యూత్ కాంగ్రెస నేతలు ఒకరిపై రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ దళిత మోర్చా కార్యకర్తలకు తలకి గాయమైంది. 

ALSO READ : కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే చేస్కోనియ్యండి.. : హరీశ్ రావు

హైదరాబాద్ బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి అసలు కారణం ఇదే. ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తాం అంటూ ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి కామెంట్స్ చేశారు. దీనిపై ఢిల్లీలోనూ రెండు రోజులుగా మాటల యుద్ధం నడుస్తుంది. బీజేపీ నేత రమేశ్ బిథూరి వ్యాఖ్యలను ఖండిస్తూ.. బీజేపీ ఆఫీసుపై తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.