ఏపీలో జగన్ పార్టీ ... కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే అని ప్రధాని మోదీ అన్నారు. ఈ రుఎండు పార్టీలు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు ఒకే కుటుంబంలోని సభ్యులు అధినేతలుగా ఉన్నారని మోదీ అన్నారు. ఏపీ మంత్రులు ఒకరికి మించి ఒకరు అవినీతికి పాల్పడుతున్నారు. వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందన్నారు. ఏపీలో సమగ్రాభివృద్ది జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్రావాలి. ఏపీ అభివృద్ది చెందాలంటే ప్రతి ఒక్కరు ఓటు వేయాలన్నారు, ఓట్లు చీలకుండా ఎన్డీఏను గెలిపించాలన్నారు.
2024 ఎన్నికల్లో రెండు సంకల్పాలతో ముందుకు వెళ్తున్నాం అని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ సర్కార్ ను తిరిగి తీసుకొచ్చి..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారని ప్రధాని మోది అన్నారు,గత ఐదేళ్లలో ఏపీ అభివృద్ది కుంటుపడిందన్నారు. రాబోయే ఐదేళ్లు చాలా కీలకమన్నారు. ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ది చేస్తామన్నారు.