కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. కర్ణాటకలో ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని ఆశిస్తుస్తున్నట్లు ట్విట్ చేశారు మోడీ. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తల కృషిని అభినందించారు మోడీ.
ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం సాయంత్రం 5.30 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ 121సీట్లలో విజయం సాధించగా.. మరో 15 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 56స్థానాల్లో గెలవగా.. మరో 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ పార్టీ 18 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 2 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు
