జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్దరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలకు మందు కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తోందంటూ ఆరోపించారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రజల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎజెండా లేకపోవడంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
గతేడాది అగష్టు 5వ తేదీన ప్రధాని మోడీ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దీంతో మోడీ ఏకపక్ష, రాజ్యాంగ విరుద్దమైన నిర్ణయాలను తిప్పికోట్టాలంటూ చిదంబరం చేసిన ప్రకటనపై నడ్డా తీవ్రంగా స్పందించారు.
