జీపీ సెక్రటరీల బదిలీల్లో గందరగోళం

  •     డీపీవో ఆఫీస్ లో బైఠాయింపు

గద్వాల, వెలుగు: గ్రామపంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో గందరగోళం నెలకొంది. ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్ లు ఇచ్చారని ఆరోపిస్తూ మంగళవారం కలెక్టరేట్​లోని డీపీవో ఆఫీస్​ను సెక్రటరీలు ముట్టడించారు. ఈ సందర్భంగా జీపీ సెక్రెటరీల సంఘం నాయకులు మాట్లాడుతూ ఎలాంటి సమాచారం లేకుండా గ్రామపంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారని ఆరోపించారు. 

గద్వాల నియోజకవర్గంలో పని చేస్తున్న వారిని అలంపూర్ కు, అక్కడి నుంచి గద్వాల నియోజకవర్గంలోని జీపీలకు బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాలను మార్చడం సమంజసం కాదన్నారు. ఈ బదిలీలతో మహిళా సెక్రటరీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే పరిశీలిస్తామని ఇన్​చార్జి డీపీవో వెంకట్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.