కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ లో వైసీపి-టీడీపీ వర్గీయులు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు, కొడవళ్ళతో పరస్పరం డాడులకు దిగారు. పాత కక్షల కారణంగా గ్రామ వాలంటీర్, అతని బంధువులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. వైసీపీ కి చెందిన వాలంటీర్ తాళ్ళపల్లె రాకేష్, అతని పెదనాన్న జ్ఞానముత్తుపై టీడీపీ వర్గీయులు వేట కొడవళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో రాకేష్ చేతికి, జ్ఞానముత్తు తలకి బలమైన గాయలయ్యాయి. జ్ఞానముత్తు పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారంతా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

