న్యూఇయర్​ ​వేడుకలపై కండిషన్స్ అప్లయ్..ట్యాంక్​బండ్​ చుట్టూ ట్రాఫిక్ ​ఆంక్షలు

  •     ట్యాంక్​బండ్​ చుట్టూ  రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ​ఆంక్షలు
  •     పలుచోట్ల వాహనాల దారి మళ్లింపు
  •     ప్రమాదాలకు చాన్స్​ లేకుండా అన్ని ఫ్లైఓవర్లు క్లోజ్
  •     డీజేలకు నో పర్మిషన్..మ్యూజికల్​ ఈవెంట్స్ ​ఇండోర్​లోనే..
  •     సౌండ్​ 45 డెసిబుల్స్ దాటితే యాక్షన్

హైదరాబాద్​సిటీ, వెలుగు : కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మహానగరం సిద్ధమైంది. ది మోస్ట్​హ్యాప్పెనింగ్​సిటీలో న్యూ ఇయర్ ఈవెంట్స్​గ్రాండ్​గా సెలబ్రేట్​చేసే అవకాశం ఉండడంతో పోలీసులు ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. లా అండ్​ఆర్డర్​పోలీసులతో పాటు ట్రాఫిక్ డిపార్ట్​మెంట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. రూల్స్​ బ్రేక్​ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నారు. డీజేలు వాడకూడదని, మ్యూజికల్ ఈవెంట్స్ అయితే ఇండోర్​లో మాత్రమే జరుపుకోవాలని సూచిస్తున్నారు. 45 డెసిబుల్స్‌‌కి మించి సౌండ్ పొల్యూషన్​క్రియేట్​చేస్తే యాక్షన్​తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఈవెంట్స్‌‌ జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్స్‌‌, పార్కింగ్‌‌ ఏరియాల్లో తప్పనిసరిగా సీసీ టీవీ కెమెరాలు మెయింటెయిన్ ​చేయాలని, భద్రత కోసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్​కు చెక్​పెట్టేందుకు సిద్ధమయ్యారు.

వేడుకల్లో డ్రగ్స్ నివారణపై ఎక్సైజ్, టీజీ న్యాబ్​కూడా దృష్టి పెట్టింది. వారం రోజుల నుంచి విస్తృత తనిఖీలు చేస్తూ సిటీలోకి డ్రగ్స్ రాకుండా చర్యలు తీసుకుంటోంది. అక్కడక్కడా డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకుంటోంది. సోమవారం కూడా పలుచోట్ల గంజాయి, డ్రగ్స్​పట్టుకుంది.

రిసార్టులూ అనుమతి తీసుకోవాలి : చేవెళ్ల ఏసీపీ కిషన్

చేవెళ్ల : రిసార్టుల్లో న్యూఇయర్​వేడుకలు నిర్వహిస్తే పర్మిషన్లు తీసుకోవాల్సిందేనని సైబరాబాద్​పోలీసులు ప్రకటించారు. గతంలో రిసార్టులతో పాటు ఫామ్ హౌస్​లో  పర్మిషన్లు లేకుండానే ఈవెంట్లు నిర్వహించేవారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారే అవకాశం ఉండడంతో ఈ ఏడాది కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్​పల్లితో పాటు ఇతర ఏరియాల్లోని రిసార్టుల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రూల్​పెట్టారు.

మొయినాబాద్ పరిధిలోని మృగవని, హైదరాబాద్ పోలో హార్స్ రైడింగ్, బాకారం రెవెన్యూలోని డ్రీమ్ వాల్యూ రిసార్టులు అనుమతులు తీసుకున్నాయని చేవెళ్ల ఏసీపీ కిషన్ తెలిపారు. టౌన్, రూరల్​ప్రాంతాల్లో కూడా డ్రంకన్​డ్రైవ్​చేస్తామన్నారు. పబ్లిక్​ప్లేసుల్లో వేడుకలు నిర్వహించినా, మద్యం సేవించినా, రోడ్లను బ్లాక్​చేసి వేడుకలు చేసుకున్నా, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడుతామన్నారు. పటాకులు, డీజేలపై నిషేధం ఉందన్నారు. 

ప్రధానంగా ట్రాఫిక్​ ఆంక్షలు ఉండే ఏరియాలు

  •  హుస్సేన్‌‌ సాగర్‌‌‌‌ చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్  ఆంక్షలు అమలులో ఉంటాయి. 
  •  రాజ్‌‌భవన్‌‌ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌‌‌‌ ఎక్కి నెక్లెస్​రోడ్​వెళ్లడానికి పర్మిషన్​ లేదు. వీవీ విగ్రహం వద్ద నుంచి షాదాన్‌‌ కాలేజీ వైపు వెహికల్స్ ​మళ్లింపు  ఉంటుంది. 
  •   ఓల్డ్‌‌ అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్‌‌టీఆర్‌‌‌‌ మార్గ్‌‌ వైపు అనుమతి లేదు. ఇక్బాల్​మినార్‌‌‌‌ వైపు ప్రయాణించాలి.  
  •  ఇక్బాల్‌‌ మినార్‌‌‌‌ నుంచి ఎన్టీఆర్‌‌‌‌ మార్గ్‌‌, బనియన్ ట్రీ, ప్రింటింగ్‌‌ ప్రెస్‌‌ వైపు వచ్చే వెహికల్స్​ను సెక్రటేరియట్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు
  •   ఖైరతాబాద్ మార్కెట్‌‌ నుంచి నెక్లెస్ రోటరీ వైపు ఎంట్రీ లేదు. వీరు బడా గణపతి వద్ద రాజ్‌‌ధూత్‌‌ లేన్‌‌ లక్డీకాపూల్‌‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.  
  •   సెక్రటేరియెట్‌‌ జంక్షన్ నుంచి అప్పర్ ట్యాంక్‌‌ బండ్‌‌ వెళ్లే ట్రాఫిక్‌‌ను అంబేద్కర్‌‌‌‌ విగ్రహం వద్ద మళ్లిస్తారు.
  •   మినిస్టర్ రోడ్స్ నుంచి పీవీఎన్‌‌ఆర్‌‌‌‌ మార్గ్‌‌ వైపు వెళ్లే వాహనాలను నల్లగుట్ట క్రాస్ రోడ్స్‌‌ వద్ద రాణిగంజ్‌‌ వైపు డైవర్ట్‌‌ చేస్తారు
  •  బుద్ధభవన్‌‌ నుంచి పీవీఎన్‌‌ఆర్‌‌‌‌ మార్గ్‌‌ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. కర్బాల మైదాన్‌‌ వైపు వెళ్లాలి.  
  •  దోబీఘాట్‌‌ –  చిల్డ్రన్స్‌‌ పార్క్‌‌ వెళ్లే వాహనాలను డీబీఆర్‌‌‌‌ మిల్స్‌‌ వద్ద కవాడిగూడ క్రాస్ రోడ్స్‌‌ వైపు మళ్లింపు.
  •   డీబీఆర్‌‌‌‌ మిల్స్‌‌, సీజీఓ టవర్స్ నుంచి సెయిలింగ్​క్లబ్‌‌ వైపు వచ్చే ట్రాఫిక్‌‌ను కవాడిగూడ క్రాస్ రోడ్స్‌‌ వద్ద జబ్బర్ కాంప్లెక్స్‌‌ వైపు మళ్లిస్తారు.

ఈవెంట్ ​ఆర్గనైజర్లకు సూచనలు

  •  -హోటల్స్, పబ్, క్లబ్ నిర్వాహకులు అనుమతులు తీసుకోకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే యాక్షన్. ​ 
  •  -పరిమితికి మించి పాసులు అమ్మొద్దు. లిమిట్​దాటి టికెట్స్, కూపన్స్ ఇష్యూ చేయొద్దు.  
  •  -డీజేలకు అనుమతులు లేవు, మ్యూజికల్ ఈవెంట్స్ ఇండోర్‌‌‌‌లో మాత్రమే జరుపుకోవాలి.
  •  45 డెసిబుల్స్‌‌కు మించి సౌండ్ పొల్యూషన్ ఉండొద్దు.  
  •  నిర్వాహకులు అసభ్యకర డ్యాన్సులకు, డ్రెస్సింగ్‌‌ను అనుమతించొద్దు.  
  •  ---లిక్కర్ పార్టీల్లోకి మైనర్లను అనుమతించొద్దు.  
  •  బార్స్, వాక్‌‌వేస్, టాయిలెట్స్, లిఫ్టులు, కారిడార్ల వద్ద స్టాఫ్‌‌ను నియమించాలి.
  •  -ఈవెంల్స్​లో సీసీ కెమెరాలు తప్పనిసరి. 
  •  -డ్రంకన్ కండిషన్‌‌లో ఉన్న వారు వెహికల్ డ్రైవ్ చేయొద్దనే సూచిక బోర్డులు పెట్టాలి.

రాచకొండ  కమిషనరేట్‌‌ పరిధిలో..

  •  ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లైట్‌‌ మోటార్ వెహికల్స్‌‌ ను అనుమతించరు. హెవీ వెహికల్స్‌‌ కు మాత్రమే అనుమతి. 
  •  ఎయిర్‌‌‌‌ పోర్టుకు వెళ్లే ప్రయాణికులను లైట్​మోటార్​వెహికల్స్ లో అనుమతిస్తారు. ఫ్లైట్​టికెట్​చూపించాలి.  
  •  నాగోలు, కామినేని, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్‌‌, బైరామల్‌‌గూడ మల్టీలెవల్‌‌ ఫ్లై ఓవర్లు క్లోజ్.
  •  ఎల్బీనగర్‌‌, ‌‌చింతల్‌‌కుంట అండర్‌‌ ‌‌పాస్‌‌లలో హెవీ వెహికల్స్‌‌కు మాత్రమే అనుమతి ఉంటుంది.