జమిలీ ఎన్నికల ఆలోచన మంచిదే 

జమిలీ ఎన్నికల ఆలోచన మంచిదే 

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ మద్దతుగా నిలిచారు. ప్రధాని మోడీ తీసుకొచ్చిన జమిలీ ఎన్నికల ఆలోచనపై సద్గురు కామెంట్ చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచి ఆలోచన అన్నారు. ‘ప్రధాని మోడీ జమిలీ ఎన్నికల ఆలోచన చేస్తున్నారనేది నా దృష్టికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఐదేళ్లకు ఓసారి లోక్‌‌సభ ఎన్నికలు నిర్వహించాలి. ఆ తర్వాత రెండున్నరేళ్లకు అసెంబ్లీ పోల్స్ జరపాలి. పార్టీలు రాజకీయంగా తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి రెండు మార్లు అవకాశం వస్తుంది. ఏడాదంతా ఎన్నికలే ఉంటే నాయకుల వాక్చాతుర్యం చూడటం తప్ప మిగతా పనులేం కావు’ అని సద్గురు చెప్పారు. అలాగే ఎన్నికల కమిషన్‌‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని సూచించారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్‌‌ను 90 రోజుల్లో ముగించాలన్నారు.