నాగర్ కర్నూల్లో కల్తీ డీజిల్ పై ఆందోళన

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పెట్రోల్  బంక్ లో కల్తీ డీజిల్ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని టెలిఫోన్  ఎక్సేంజీ  పక్కన ఉన్న పెట్రోల్ బంక్ లో  సోమవారం త్రిశూల్  బోర్ వెల్  ఓనర్​ డీజిల్  కొట్టించుకొని కొద్ది దూరం వెళ్లగానే వెహికల్​ మొరాయించింది. డీజిల్ ట్యాంకులో నీళ్లు కనిపించడంతో బంక్  ఓనర్​తో గొడవకు దిగారు. దీంతో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని బంక్  ఓనర్​ రిక్వెస్ట్​చేశాడు. 

ALSO READ : ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : తేజస్ నందలాల్ పవార్