తిరుపతి అలిపిరి దగ్గర ఆందోళన చేస్తున్నారు భక్తులు. ఈ నెల 24 వరకు సర్వదర్శనం టిక్కెట్లు ముందుగా కేటాయించడంతో…. తిరుమలకు అనుమతించాలని నిరసనకు దిగారు భక్తులు. స్వామి వారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చామని…. తమను అలిపిరి దగ్గరే ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి దగ్గర రోడ్డుపై కూర్చున్నారు భక్తులు. ఐతే దర్శనానికి ఒక రోజు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామంటున్న టీటీడీ అధికారులు.
భక్తుల ఆందోళనతో అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దేవస్థానం అధికారులు, పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి గేటు వద్ద ఉద్రిక్తత నెలకుంది. సహనం కోల్పోయిన పోలీసులు టోకెన్ల కోసం ఆందోళన చేస్తున్న భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వారు నిర్దాక్షిణ్యంగా తోసేశారు. పలువరు భక్తులపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శానానికి వస్తే కొట్టి చంపేస్తారా అంటూ పోలీసులను భక్తులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుతో మహిళా భక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
